100% బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణికి హ్యాపీ బర్త్ డే.. ‘డంకీ’తోమరో బ్యూటీపుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించున్న స్టార్ డైరెక్టర్

Blog Image

ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే అందమైన సినిమాలను తెరకెక్కించే అరుదైన దర్శకుల్లో రాజ్‌కుమార్ హిరాణీ ఒకరు. ఈరోజు ఆయన త న పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన కేవలం హిట్ చిత్రాలను మాత్రమే రూపొందించలేదు. ప్రేక్షకుల హృదయాలపై శాశ్వతమైన ప్రభావాన్ని చూపిన సినిమాలను డైరెక్ట్ చేశారు. . సంజు, పీకే, త్రీ ఇడియట్స్ మున్నాభాయ్ లగే రహో, మున్నాభాయ్ జిందా బాద్ సినిమాలను హిరాణి మనకు అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఒక్కో సినిమాను ఒక్కో వజ్రంగా ఆయన ఆవిష్కరించారు. ఇప్పుడు ‘డంకీ’ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో తొలిసారి రాబోతున్న సినిమా ఇది. హాయిగా నవ్వుకునే సినిమానే కాదు, మనసుకు హత్తుకునే భావోద్వేగాల కలయికగా డంకీ సినిమా ప్రేక్షకులను మెప్పించనుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన సినిమాలనే కాకుండా మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను రూపొందించటం రాజ్ కుమార్ హిరాణి స్పెషాలిటీ. ఆయన మూవీ నెరేషన్‌లో మన సంస్కృతిని చక్కగా చూపించటంతో పాటు సంభాషణలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. సమాజంపై శాశ్వతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆయన సినిమా మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను రాబట్టుకుంటున్నాయి. 

డంకీ సినిమాను వీక్షించేటప్పుడు మధురమైన అనుభూతులతో పాటు సినిమాలోని చక్కటి మాధుర్యం చూపించి ప్రేక్షకులకు సినిమాపై ఉన్న వ్యామోహాన్ని మరింత పెంచుతుంది. రీసెంట్‌గా రిలీజైన ‘డంకీ డ్రాప్ 1’తో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఇది ప్రేమ, స్నేహం అనే అంశాలపై నలుగురి స్నేహితుల మధ్య నడిచే కథాంశం. తమ జీవితానికి సంబంధించిన కలలను సాకారం చేసుకోవటానికి వారు చేసిన ప్రయాణాన్ని చూపించే ఈ సినిమా కొన్ని నిజ ఘటనల ఆధారంగా రూపొందుతుంది. 

షారూక్ ఖాన్‌తో పాటు బోమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన డంకీ సినిమాలో కామెడీ, ఎమోషన్స్, చక్కటి సందేశం కలయికగా డంకీ సినిమా ఆకట్టుకుంటుందనే హామీని డంకీ డ్రాప్ ప్రేక్షకులకు ఇచ్చింది. ఈ చిత్రం ఈ డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌వుతుంది.

20th Nov 2023 12:19 AM

#rajKumarHirani

#shahRukhKhan

#birthday

Thumb Card Image
వ్యూహం సినిమా రిలీజ్ ఖాయం: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
15th Dec 2023 4:23 PM
Thumb Card Image
యానిమల్‌ రివ్యూ....
14th Dec 2023 2:22 PM
Thumb Card Image
Ram Gopal Varma's "Vyuham" Gets a Clean U Certificate
14th Dec 2023 7:59 AM
Thumb Card Image
ఆర్జీవి వ్యూహానికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌...
14th Dec 2023 7:52 AM
Thumb Card Image
Rajinikanth: The Undisputed King of Indian Cinema
12th Dec 2023 11:50 PM
Thumb Card Image
Review: Hai Nanna
7th Dec 2023 9:03 AM
Thumb Card Image
రివ్యూ : హాయ్ నాన్న  
7th Dec 2023 9:01 AM
Thumb Card Image
Animal Review
2nd Dec 2023 12:31 AM
Thumb Card Image
Producer Dasari Kiran Kumar gets birthday wishes from director Ram Gopal Varma
28th Nov 2023 7:08 PM
Thumb Card Image
నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌కి బర్త్‌డే విషెశ్‌– దర్శకుడు ఆర్జీవి
28th Nov 2023 6:46 PM
Thumb Card Image
నవంబర్ 28 న 'సంకల్ప్ దివస్ 2023' సెలబ్రేషన్స్... సంప్రదాయ వేదిక, శిల్పారామం లో
25th Nov 2023 6:25 PM
Thumb Card Image
48ఏళ్ల మోహన్ బాబు...
23rd Nov 2023 7:24 PM
Thumb Card Image
జోరుగా హుషారుగా: డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల! యువతకు, కుటుంబాలకు నచ్చే ఎంటర్‌టైనర్
22nd Nov 2023 12:05 AM
Thumb Card Image
శ్రీకాంత్, తాన్వీ ఆకాంక్షలతో విజయ్ భాస్కర్ 'ఉషా పరిణయం'
21st Nov 2023 4:06 PM
Thumb Card Image
Panja Vaisshnav Tej Shines in Mass Avatar in Aadikeshava Trailer
21st Nov 2023 1:05 PM
Thumb Card Image
ఫైనల్ 2023 – వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టేన్ లకు ఆహ్వానం.!
18th Nov 2023 11:13 AM
Thumb Card Image
కుటుంబంతో దేవరకొండ.! Vijay Devarakonda
13th Nov 2023 12:30 AM
Thumb Card Image
దీపాల వెలుగులో “అనుపమ వెలుగులు”.! Anupama Parameshwaran
13th Nov 2023 11:11 PM
Thumb Card Image
యాక్షన్ సీన్లకు డూప్ వద్దంటున్న ఎన్టీఆర్.!
13th Nov 2023 11:04 PM
Thumb Card Image
టాలీవుడ్ లో మరో విషాదం.! Actor Chandramohan Passed Away
13th Nov 2023 10:42 PM

Follow us on :