జోరుగా హుషారుగా: డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల! యువతకు, కుటుంబాలకు నచ్చే ఎంటర్టైనర్
బేబి చిత్రంలో నటించి ప్రశంసలు అందుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా, పూజిత పొన్నాడ హీరోయిన్గా నటించే తాజా చిత్రం జోరుగా హుషారుగా. అను ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు.
యువతకు, కుటుంబాలకు నచ్చే ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత నిరీష్ తిరువిధుల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "యువతకు, కుటుంబాలకు నచ్చే ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి సహకారంతో చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేస్తున్నాం" అన్నారు.
దర్శకుడు అను ప్రసాద్ మాట్లాడుతూ, "ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్‌ను కొత్తగా చూస్తారు. ఆయన పాత్రలో మంచి ఎనర్జీ ఉంటుంది. బేబి చిత్రంతో యూత్‌కు దగ్గరైన విరాజ్ ఈ చిత్రంతో వారికి మరింత చేరువతాడు. కొత్తదనం ఆశించే ప్రతి ఒక్కరికీ మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది" అన్నారు.
విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ, చమ్మక్ చంద్ర, క్రేజీ కన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్, ఎడిటర్: మర్తండ్‌కెవెంకటేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: తేజ తిరువిధుల