రివ్యూ : హాయ్ నాన్న
నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, 'బేబీ' కియారా ఖన్నా, జయరామ్, ప్రియదర్శి, అంగద్ బేడీ, విరాజ్ అశ్విన్ తదితరులతో పాటు అతిథి పాత్రల్లో శృతి హాసన్, నేహా శర్మ, రితికా నాయక్
కథ, దర్శకత్వం: శౌర్యువ్
మాటలు: నాగేంద్ర కాశీ
ఛాయాగ్రహణం: సాను జాన్ వర్గీస్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
విడుదల తేదీ: డిసెంబర్ 6, 2023
నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా 'హాయ్ నాన్న'. 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ రోజు సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం రండి.
కథ :
ముంబైలో విరాజ్ (నాని) ఓ ఫే మస్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. తన కూతురు మహి (బేబీ కియారా ఖన్నా)తో కలిసి ఉంటాడు. ఐతే, మహి ఒక లంగ్ డిసీజ్‌తో బాధ పడుతూ ఉంటుంది. ఆమె ఎక్కువ రోజులు బ్రతకలేదని డాక్టర్స్ చెబుతారు. కాకపోతే, తన కూతురు తనను వదిలి వెళ్ళదని విరాజ్ బలంగా నమ్ముతుంటాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం ఆ చిన్నారిని ఓ ప్రమాదం నుంచి యష్ణ (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. అ లా విరాజ్ లైఫ్ లోకి వచ్చిన యష్ణ ఎవరు ?, ఆమెకు విరాజ్ కి సంబంధం ఏమిటి ?, చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
తండ్రికూతుర్ల అనుబంధాన్ని చాటి చెప్పే విధంగా డీసెంట్ ప్లేతో - స్లో నేరేషన్ తో దర్శకుడు ఈ 'హాయ్ నాన్న' చిత్రాన్ని తెరకెక్కించాడు. కాకపోతే, ఇలాంటి సగటు కుటుంబ కథా చిత్రాలు తెలుగు తెరకు కొత్త కాదు. తల్లి లేని కుమార్తెను ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రిని చూసి ప్రేమలో పడే ప్రేమ కథలూ కొత్త కాదు. నాగార్జున సంతోషం సినిమా జోనర్ లోనే వచ్చింది ఈ హాయ్ నాన్న. ఐతే, ఈ 'హాయ్ నాన్న'లో తండ్రి - కూతురు పాత్రల కంటే, తల్లి పాత్రను చాలా కీలకమైనదిగా రాసుకున్నాడు దర్శకుడు. పైగా ఆ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. కానీ, ఆ ట్విస్ట్ చుట్టూ నడిచే సీన్లు కూడా బాగుండి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. ఇక ఫ్లాష్ బ్యాక్ కూనర్ లో నడిచే ప్రేమకథ రెగ్యులర్ గా & చాలా రొటీన్ గా సాగుతుంది. 'సారొచ్చారు' ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. మధ్యలో పాటలు కాస్త ఉపశమనం కలిగించినా.. గోవా సీక్వెన్సెస్ నీరసాన్ని తెప్పిస్తాయి. ఐతే, జయరామ్ పాత్ర తాలూకు ట్విస్ట్ బాగుంది. ఇక ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత నుంచి ముగింపు వరకు దర్శకుడు సినిమాని ఇంట్రెస్ట్ గానే నడిపాడు. మొత్తంగా హాయ్ నాన్న గురించి సింపుల్ గా చెప్పాలంటే.. సినిమాలో ఎమోషన్స్ ఉన్నా.. ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది. నాని - మృణాల్ పాత్రల మధ్య కెమిస్ట్రీ ఉన్నా.. లవ్ మిస్ అయ్యింది. కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ పండాయి. అలాగే, నాని పెర్ఫామెన్స్, మృణాల్ నటన ప్రేక్షకులను మెప్పిస్తాయి. జయరామ్, ప్రియదర్శి మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్:
మెయిన్ థీమ్,
నాని నటన,
మ్యూజిక్ & సాంగ్స్
ఫస్టాఫ్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్
కొన్ని సాగదీత సన్నివేశాలు
రెగ్యులర్ ప్లే.
తీర్పు:
మొత్తమ్మీద ఈ 'హాయ్ నాన్న' సినిమా చూస్తున్నంత సేపూ నిదానంగా ముందుకు వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ, సినిమాలో ఎమోషన్స్, టేకింగ్ అండ్ మేకింగ్, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం చాలా బాగున్నాయి. ఒక్కమాటలో.. ఫ్యామిలీస్ కి మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.
రేటింగ్ : 2.75 / 5
బోటమ్ లైన్ : హాయ్ నాన్న.. ఫ్యామిలీస్ ను హత్తుకున్నా.. మాస్ కు నీరసం తెప్పిస్తాడు.