48ఏళ్ల మోహన్ బాబు...

Blog Image

తెలుగు చిత్ర సీమని ప్రేమించే ప్రేక్షకులకు భక్తవత్సలం నాయుడు అంటే ఎంతమందికి తెలుసు? అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భక్తవత్సలం ఎంతమందికి తెలుసు? ఫిజికల్‌ ట్రైనర్‌గా పనిచేసిన భక్తవత్సలం ఎంతమందికి తెలుసు? 1973లో మద్రాస్ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో శివాజిరావు గైక్వాడ్‌తో (రజనీకాంత్‌) కలిసి యాక్టర్‌గా ఓనమాలు దిద్దిన భక్తవత్సలం ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడో తిరుపతి దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు మోదుగులపాలెం అనే ఊరిలో పుట్టిన మధ్యతరగతి రైతుబిడ్డ సినిమా పరిశ్రమలో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపిస్థాడని ఎవరు అనుకుంటారు? ఆయనకూడా ఇలాంటి గొప్ప కల పొరపాటున కూడా కని ఉండకపోవచ్చు.కానీ విధి అన్నింటికంటే ఎంతో బలియమైనది. ఆ విధి భక్తవత్సలాన్ని మోహన్‌బాబు చేసింది. తెలుగు సినిమాని ఒక ఆట ఆడుకునేలా చేసింది. చాలామంది ప్రేక్షకులు భక్తవత్సలం అనగానే ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటారు. అదే ‘స్వర్గం–నరకం’ సినిమాలో మెయిన్‌లీడ్‌గా నటించిన విలన్‌ మోహన్‌బాబు అంటే తెలియని వాళ్లు ఎంతమంది ఉంటారు? దాదాపు అందరికి తెలుసు. అదే సినిమా స్క్రీన్‌కి ఉన్న పవర్‌. స్క్రీన్‌మీద కనిపించని ఎంతోమంది గొప్పవాళ్లు, డబ్బున్నవాళ్లు, పవర్‌ఉన్నవాళ్లు ఉండొచ్చు. కానీ, మేకప్‌ వేసుకుని స్క్రీన్‌మీద కనిపించగానే వచ్చే గుర్తింపే వేరబ్బా...ఈ విషయాన్ని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భక్తవత్సలం కనిపెట్టాడు. తన గురువు దాసరిని నమ్ముకుని దండమెట్టాడు. ఆ రోజు పెట్టిన దండం విలువ ఈ రోజు మంచు సామ్రాజ్యానికి నాంది పలికింది. సరిగ్గా 48 ఏళ్ల క్రిందట అద్దె ఇంట్లో ఉండటానికి కూడా అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్న మంచు మోహన్‌బాబు తర్వాత కాలంలో వందలకొద్ది సినిమాల్లో నటించాడు. ఏ పాత్ర చేసిన విలక్షణత ఆయన సొంతం. కంచులాంటి కంఠంతో తనకంటూ ఒక డిక్షన్‌ని తయారు చేసుకున్నాడు. స్రీన్‌మీద కనిపించిన మొదటి సినిమా సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ అయితే మెయిన్‌లీడ్‌లో నటించిన చిత్రం మాత్రం ‘స్వర్గం–నరకం’. ఆ సినిమాతో తనకు సినిమా పరిశ్రమలో గాడ్‌ఫాదర్‌ దొరికాడు. తండ్రిలాంటి దర్శకుడు దాసరి నారాయణరావు మోహన్‌బాబుని బిడ్డలా దగ్గరికి తీసుకున్నాడు. 

undefined

నిర్మాతగా మోహన్‌బాబు...

నటునిగా మారిన తొలేడాది రెండు, మూడు సినిమాల్లో నటిస్తే రోజలు గడిచేకొద్ది ఏడాదికి పది, పదిహేను, ఇరవై సినిమాల్లో నటిస్తూ సినిమా మీద సినిమాలు చేస్తూ చూస్తుండగానే టాప్‌ ఆర్టిస్ట్‌గా ఎదిగారాయన. రోజుకు రెండు షిఫ్ట్‌లు మూడు షిఫ్ట్‌లు షూటింగ్‌లు చేస్తూనే ఉన్నాడు. అలుపులేకుండా పనిచేస్తూనే ఉన్న మోహన్‌బాబుకి మరో మెట్టెక్కాలనిపించింది. మరో ఆలోచనేలేకుండా 1982లో ‘‘ప్రతిజ్ఞ’’ సినిమాద్వారా తన కూతురు లక్ష్మీప్రసన్న పేరుమీద ‘లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌’ అనే బ్యానర్‌ని స్థాపించి నిర్మాతగా మారారు. నిర్మాతగా మారిన తర్వాత మొదటి సినిమాతోనే విజయం వరించింది. తర్వాత కొన్ని పరాజయాలు. సినిమా పరిశ్రమలో సక్సెస్‌తో స్వర్గాన్ని ఓ పక్క , ఫెయిల్యూర్స్‌తో నరకాన్నోపక్క రెంటిని సమానంగానే రుచి చూశారు మోహన్‌బాబు. 1989– 1990 నుండి నిర్మాతగా ఆయన రాత మారిందనే చెప్పాలి. మోహన్‌బాబు హీరోగా నిర్మాతగా చేసిన చిత్రాల్లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అల్లుడుగారు’. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ కె.యస్‌ ప్రకాశరావు దర్శకత్వం వహించిన ‘రౌడిగారి పెళ్లాం’ బి.గోపాల్‌ దర్శకత్వంలో విడుదలైన ‘అసెంబ్లీ రౌడి’, ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ‘పుణ్యభూమి నా దేశం’, రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన ‘పెదరాయుడు’ నిర్మాతగా మోహన్‌బాబుని ఆకాశంలో నిలబెట్టాయి. 

undefined

అప్పటివరకు మామూలుగా ఉన్న మోహన్‌బాబు ‘అల్లుడుగారు’ చిత్రం సాధించిన ఘనవిజయం తర్వాత కలెక్షన్‌కింగ్‌ మోహన్‌బాబుగా మారారు. అదే దర్శకుడితో తాను దైవంగా భావించే అన్న నందమూరి తారక రామారావుని హీరోగా పెట్టి ‘మేజర్‌ చంద్రకాంత్‌’తో భారీ విజయాన్ని అందుకున్నారు మోహన్‌బాబు. ఆ సిల్వర్‌జూబ్లి చిత్రమే యన్టీఆర్‌కి నటునిగా ఆఖరి చిత్రం. అలా నిర్మాతగా లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ను ఒక పెద్ద బ్రాండ్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రభాగాన నిలబెట్టారు మోహన్‌బాబు.  

undefined

శ్రీవిధ్యానికేతన్‌...

1993లో మోహన్‌బాబు విధ్య మీద ఉన్న మక్కువతో తన భార్య పేరిట ‘శ్రీ విధ్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌’ అనే స్కూల్‌ని తిరుపతిలో వందలెకరాల్లో స్థాపించారాయన. గత 30 ఏళ్లుగా ఆ సంస్థలో చదువుకున్న ఎందరో విధ్యార్థులు దేశవిదేశాల్లో అత్యుత్తమ సంస్థల్లో గొప్ప పొజిషన్లలో ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థితిలో ఉన్నారు. తర్వాతర్వాత ‘శ్రీ విధ్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌’లో అనేక కోర్సులు ఎంటర్‌ అయ్యాయి. డిగ్రీకాలేజ్, ఇంజనీరింగ్‌ కాలేజ్, ఫార్మసి కాలేజి, నర్సింగ్, మేనేజ్‌మెంట్‌ ఇలా ఎన్నో శాఖలకు విస్తరించింది మోహన్‌బాబు కాలేజి. 2022 జనవరి నుండి ‘శ్రీ విధ్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌’ మోహన్‌బాబు యూనివర్సిటీగా మారటం మోహన్‌బాబు జీవితంలోనే ఊహించని గొప్పమలుపుగా భావించవచ్చు.

undefined

 

మోహన్‌బాబు– లక్ష్మీప్రసన్న, విష్ణు, మనోజ్‌...

తెలుగు సినిమా ఇండస్ట్రీ తనకెంతో ఇచ్చింది. తనతో పాటు తన బిడ్డలు ఇండస్ట్రీలోనే ఉంటూ ఎంతోమందికి ఉపాధి చేకూర్చాలనేది మోహన్‌బాబు కన్న మరో కల. ఆ కలను నిజం చేస్తూ తన పిల్లలందరూ నటులుగా, నిర్మాతలుగా ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముగ్గురు పిల్లల్లో విష్ణు ప్రస్తుతం మా అధ్యక్షునిగా ఉన్నారు. 2023లో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్తకన్నప్ప’ను తెరకెక్కిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. లక్ష్మీ టీవీ షోలు, సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. మంచు మనోజ్‌ హోస్ట్‌గా టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టి తన ప్రతిభను పరీక్షించుకుంటున్నాడు.

రాజకీయరంగంలో మోహన్‌బాబు...

మోహన్‌బాబు యన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉండేవారు. యన్టీఆర్‌ తర్వాత పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్న చంద్రబాబునాయుడుతో కూడా ఎంతో సన్నిహితంగా మెలిగేవారు మోహన్‌బాబు. అందుకే మోహన్‌బాబుని రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేసింది తెలుగుదేశం పార్టీ. రాజ్యసభ సభ్యునిగా పదవి కాలం ముగిసిన తర్వాత చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉండి తన సినిమాలు తన పిల్లల సినిమాలతో బిజిగా ఉన్నారు మోహన్‌బాబు. ప్రస్తుతం వైయస్‌ఆర్‌సిపి జెండాకు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.యస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోను రాజకీయంగా దగ్గరగా ఉన్నారాయన 

సెటైర్లు– ఫ్లాప్‌లు– ట్రోలింగ్‌లు...

ఎవరిమీదైనా సెటైర్‌ వేయటం, ఒక మాటని అలవోకగా అనేయటం చాలా సులభం. గ్లామర్‌ ఫీల్డ్‌లోను, రాజకీయల్లోను ఉండేవాళ్లకి ఇదంతా సర్వ సాదారణం. కానీ ఈ మధ్య సోషల్‌ మీడియాలో వేరేవాళ్లని ధూషించటం అనే ప్రక్రియకి కొమ్ములు మొలిశాయనే చెప్పాలి. టాపిక్‌ ఏదైనా మంచు ఫ్యామిలీని అందులో ఇన్‌క్లూడ్‌ చేసి మీమ్స్, ట్రోల్స్‌ చేస్తూ ఉండటం నిత్యం గమనిస్తూనే ఉన్నాం. అవన్నీ చూస్తూ ఎంజాయ్‌ చేసే ప్రేక్షకుల సంఖ్య కూడా లక్షల్లో ఉండటం చూసి అవాక్కవ్వటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. అవే ట్రోల్స్, మీమ్స్‌ని మోహన్‌బాబు 50 ఏళ్ల కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని వేస్తే మాత్రం చాలా బావుంటుంది. మంచి విషయం గురించి నాలుగు ముక్కలు చెప్పాలంటే కథంతా తెలియాలి. చెడు గురించి ప్రచారం చేయటానికి నాలుగు ముక్కలొస్తే చాలు. ఆ ముక్కలతో ఎవరినైనా ముక్కలుగా చేయెచ్చు అనే సమాజంలో ప్రస్తుతం అందరం బ్రతుకుతున్నాం. అందుకే తెలిసిన వాళ్లైనా వాళ్లు చూసొచ్చిన ఎంతో గొప్ప జర్నీని నాలుగు మంచి మాటలతో అప్పుడప్పుడు చెప్తే బావుంటుంది. 

undefined

49వ ఏడాదిలోకి మోహన్‌...

మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటించిన ‘స్వర్గం–నరకం’ సినిమా విడుదలై విజయం నేటికి సరిగ్గా 48 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల ఆయన ప్రయాణాన్ని ఒక్కసారి అందరికి గుర్తు చేయాలని అనుకుని ఆయన జర్నీలోని అనేక సంఘటనలను సరదాగా గుర్తు చేద్దామనిపించింది. మోహన్‌బాబుగారు మీరు చూసొచ్చిన లైఫ్‌ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం, మరెన్నో జీవితాలకు ఉపాధి. తెలుగు సినిమా ఉన్నంతవరకు మీ చరిత్ర (హిస్టరీ) గురించి చెప్పుకుంటుంది. నటునిగా మీ ప్రస్థానం ప్రారంభించి వచ్చే ఏడాదికి 50ఏళ్లు. వాట్‌ ఏ బ్యూటిఫుల్‌ జర్నీ మోహన్‌బాబుగారు....

ఆల్‌ ది వెరీ బెస్ట్‌ సార్‌....    

--- శివమల్లాల

23rd Nov 2023 7:24 PM

#teluguCinema

#mohanBabu

#padmaShri

#nandiAwards

#filmfareAwards

Thumb Card Image
వ్యూహం సినిమా రిలీజ్ ఖాయం: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
15th Dec 2023 4:23 PM
Thumb Card Image
యానిమల్‌ రివ్యూ....
14th Dec 2023 2:22 PM
Thumb Card Image
Ram Gopal Varma's "Vyuham" Gets a Clean U Certificate
14th Dec 2023 7:59 AM
Thumb Card Image
ఆర్జీవి వ్యూహానికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌...
14th Dec 2023 7:52 AM
Thumb Card Image
Rajinikanth: The Undisputed King of Indian Cinema
12th Dec 2023 11:50 PM
Thumb Card Image
Review: Hai Nanna
7th Dec 2023 9:03 AM
Thumb Card Image
రివ్యూ : హాయ్ నాన్న  
7th Dec 2023 9:01 AM
Thumb Card Image
Animal Review
2nd Dec 2023 12:31 AM
Thumb Card Image
Producer Dasari Kiran Kumar gets birthday wishes from director Ram Gopal Varma
28th Nov 2023 7:08 PM
Thumb Card Image
నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌కి బర్త్‌డే విషెశ్‌– దర్శకుడు ఆర్జీవి
28th Nov 2023 6:46 PM
Thumb Card Image
నవంబర్ 28 న 'సంకల్ప్ దివస్ 2023' సెలబ్రేషన్స్... సంప్రదాయ వేదిక, శిల్పారామం లో
25th Nov 2023 6:25 PM
Thumb Card Image
జోరుగా హుషారుగా: డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల! యువతకు, కుటుంబాలకు నచ్చే ఎంటర్‌టైనర్
22nd Nov 2023 12:05 AM
Thumb Card Image
శ్రీకాంత్, తాన్వీ ఆకాంక్షలతో విజయ్ భాస్కర్ 'ఉషా పరిణయం'
21st Nov 2023 4:06 PM
Thumb Card Image
Panja Vaisshnav Tej Shines in Mass Avatar in Aadikeshava Trailer
21st Nov 2023 1:05 PM
Thumb Card Image
100% బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణికి హ్యాపీ బర్త్ డే.. ‘డంకీ’తోమరో బ్యూటీపుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించున్న స్టార్ డైరెక్టర్
20th Nov 2023 12:19 AM
Thumb Card Image
ఫైనల్ 2023 – వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టేన్ లకు ఆహ్వానం.!
18th Nov 2023 11:13 AM
Thumb Card Image
కుటుంబంతో దేవరకొండ.! Vijay Devarakonda
13th Nov 2023 12:30 AM
Thumb Card Image
దీపాల వెలుగులో “అనుపమ వెలుగులు”.! Anupama Parameshwaran
13th Nov 2023 11:11 PM
Thumb Card Image
యాక్షన్ సీన్లకు డూప్ వద్దంటున్న ఎన్టీఆర్.!
13th Nov 2023 11:04 PM
Thumb Card Image
టాలీవుడ్ లో మరో విషాదం.! Actor Chandramohan Passed Away
13th Nov 2023 10:42 PM

Follow us on :