యానిమల్‌ రివ్యూ....

Blog Image

టైటిల్‌ : యానిమల్‌

తారాగణం : రణబీర్‌ కపూర్, రష్మికా మందన్న, అనిల్‌ కపూర్, బాబి డియోల్,

కెమెరా : అమిత్‌ రాయ్‌

సంగీతం : హర్షవర్ధన్‌ రామేశ్వర్‌

నిర్మాత : భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా

కథ : ఎడిటింగ్‌– దర్శకత్వం– సందీప్‌రెడ్డి వంగా

విడుదల : డిసెంబర్‌– 1– 2023

కథ :

సినిమా కథలోకి వెళ్తే 2056లో రణభీర్‌ కపూర్ (విజయ్‌ సింగ్‌) తన కజిన్స్‌తో కూర్చుని ఒక కోతి కథను చెప్తూ అందరిని నవ్విస్తుంటాడు. అక్కడనుండి తన చిన్నతనంలోని స్కూల్‌ మెమొరీస్‌కి తీసుకువెళతాడు. ప్రతి మనిషి జీవితంలో ఏ బిడ్డకైనా నిజమైన హీరో తండ్రే. కానీ, భాద్యత గల ఆ తండ్రికి కుటుంబంతో గడిపే సమయం దొరకదు. తెలియకుండానే రోజులు వారాలవుతాయి. వారాలు నెలలు అవుతాయి. నెలలు సంవత్సరాలు అవుతాయి. తెలియకుండానే ఇంట్లో పిల్లలు పెద్ద వాళ్లవుతారు. ఆ పిల్లలు ఎలా ఫీలవుతున్నారో తండ్రికి తెలియదు. ఆ తండ్రి ఏం మిస్సయ్యాడో ఆయనకు తెలియదు. మొత్తానికి కాలం గడిచిపోతుంది. అందరి జీవితాల్లో ఇదే జరుగుతుంది కదా! ఇది చాలా సర్వ సాదారణమైన విషయమే కదా, దీనిగురించి ఏముంది అని ఎవరైనా అనుకుంటారు. కానీ రణవీర్‌సింగ్‌ లాంటి క్యారెక్టర్‌ ఉన్న వారు మాత్రం అలా అనుకోరు. నాన్నని హీరోలా చూడటమే కాదు. నువ్వు నా హీరోవి అని నాన్న అనిల్‌ కపూర్‌కి, నాన్నతో పాటు ఉండే చుట్టుపక్కలవారికి, కుటుంబానికి, ప్రేమించిన అమ్మాయికి ఎన్ని రకాలుగా చెప్పచ్చో అన్ని రకాలుగా చెప్తాడు హీరో విజయ్‌. అలాంటి నాన్నపై హత్యాప్రయత్నం జరిగితే పిచ్చి ప్రేమున్న ఆ కొడుకు ఏం చేస్తాడు? చివరకి నాన్నను కాపాడాడా? లేదా? అనేది 70MM స్క్రీన్‌పై నోరెళ్లబెట్టి చూడాల్సిందే.

undefined

నటీనటుల పనితీరు...

నటీనటులందరిలోకి ముగ్గురి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రష్మికా, రణ్‌బీర్‌ కపూర్, అనిల్‌ కపూర్‌ల నటన గురించి అందరికి తెలుసు. కానీ ‘యానిమల్‌’ సినిమాలోని వీరి నటనకు అంతకుముందు వీరు చేసిన సినిమాల్లోని నటనకు ఎంతో వ్యత్యాసముంది. ప్రతి ఒక్క ఫ్రేమ్‌లో వీరు తమ తమ పాత్రల్లో ఎలా నిలుచున్నారో చెప్పటానికి మాటలు సరిపోవు. చూసి ఎంజాయ్‌ చేయాల్సిందే. కొన్ని కొన్ని సీన్లలో వీరు నటిస్తున్నారా? లేదా మనం స్క్రీన్‌ మీద చూస్తున్నది నిజంగా జరుగుతున్నాయా? అన్నట్లుగా ఉంటుంది. ఇంతకంటే ఆ పాత్రల్లో వేరేవాళ్లని ఊహించుకోలేం. అంతబాగా నటించారందరూ. బాబిడియోల్‌ పాత్ర చిన్నదైనా కూడా ఎంతోబాగా నటించాడు.

undefined

ఎలా తీశారు...

సినిమా ప్రారంభం నుండి బిలియనీర్ల ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబం కావటంతో పెద్ద పెద్ద బంగళాలు, రేంజ్‌రోవర్‌ కార్లు, విమానాలు అబ్బ ఇలా ఉంటుందా లైఫ్‌ అనే విధంగా పాత్రలను డిజైన్‌ చేయటంతో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్, మేకప్, కెమెరా వర్క్‌లకు చేతినిండా పని ఉంటుంది. ఆ పనిని ఎంతో సమర్ధవంతంగా చేశారు వారంతా. ఇకపోతే చాలా చోట్ల హిందీ సినిమా కాబట్టి ఇలా ఉందేమో అనేలా కొన్ని సీన్లు డిజైన్‌ చేశారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా నచ్చేవిధంగా కొత్తగా ఉంటుంది. సినిమాను ఇలా తీయాలి అనే ఒక పారామీటర్‌ ఉంటుంది అనుకుంటారెవరైనా. కానీ, ఆ పరిధులన్నింటిని తుంగలో తొక్కి సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని అందరికి అర్ధమయ్యేలా తన స్టైల్‌లో చెప్పారు సందీప్‌ రెడ్డి వంగా.

ప్లస్‌లు :

– సినిమా కథ–కథనం

–డైరెక్టర్‌ ఎడిటర్‌ ఒక్కరే అవ్వటం

– రణ్‌బీర్, రష్మికల కెమిస్ట్రీ, ఫిజిక్స్‌

– బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

మైనస్‌లు : శ్రుతిమించిన రక్తపుటేరులు

ట్యాగ్‌లైన్‌ : యానిమల్‌ గుర్తుకువచ్చిన ప్రతిసారి హాంట్‌ చేస్తూనే ఉంటుంది..

రేటింగ్‌ : 4/5 శివమల్లాల

14th Dec 2023 2:22 PM

#Father-son

#relationship

#animalmovie

#Ranbir

#Singh

#Rashmika

#Mandanna

#Sandeep

#Reddy

#Vanga

#Animal

#Review

Thumb Card Image
వ్యూహం సినిమా రిలీజ్ ఖాయం: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
15th Dec 2023 4:23 PM
Thumb Card Image
Ram Gopal Varma's "Vyuham" Gets a Clean U Certificate
14th Dec 2023 7:59 AM
Thumb Card Image
ఆర్జీవి వ్యూహానికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌...
14th Dec 2023 7:52 AM
Thumb Card Image
Rajinikanth: The Undisputed King of Indian Cinema
12th Dec 2023 11:50 PM
Thumb Card Image
Review: Hai Nanna
7th Dec 2023 9:03 AM
Thumb Card Image
రివ్యూ : హాయ్ నాన్న  
7th Dec 2023 9:01 AM
Thumb Card Image
Animal Review
2nd Dec 2023 12:31 AM
Thumb Card Image
Producer Dasari Kiran Kumar gets birthday wishes from director Ram Gopal Varma
28th Nov 2023 7:08 PM
Thumb Card Image
నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌కి బర్త్‌డే విషెశ్‌– దర్శకుడు ఆర్జీవి
28th Nov 2023 6:46 PM
Thumb Card Image
నవంబర్ 28 న 'సంకల్ప్ దివస్ 2023' సెలబ్రేషన్స్... సంప్రదాయ వేదిక, శిల్పారామం లో
25th Nov 2023 6:25 PM
Thumb Card Image
48ఏళ్ల మోహన్ బాబు...
23rd Nov 2023 7:24 PM
Thumb Card Image
జోరుగా హుషారుగా: డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల! యువతకు, కుటుంబాలకు నచ్చే ఎంటర్‌టైనర్
22nd Nov 2023 12:05 AM
Thumb Card Image
శ్రీకాంత్, తాన్వీ ఆకాంక్షలతో విజయ్ భాస్కర్ 'ఉషా పరిణయం'
21st Nov 2023 4:06 PM
Thumb Card Image
Panja Vaisshnav Tej Shines in Mass Avatar in Aadikeshava Trailer
21st Nov 2023 1:05 PM
Thumb Card Image
100% బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణికి హ్యాపీ బర్త్ డే.. ‘డంకీ’తోమరో బ్యూటీపుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించున్న స్టార్ డైరెక్టర్
20th Nov 2023 12:19 AM
Thumb Card Image
ఫైనల్ 2023 – వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టేన్ లకు ఆహ్వానం.!
18th Nov 2023 11:13 AM
Thumb Card Image
కుటుంబంతో దేవరకొండ.! Vijay Devarakonda
13th Nov 2023 12:30 AM
Thumb Card Image
దీపాల వెలుగులో “అనుపమ వెలుగులు”.! Anupama Parameshwaran
13th Nov 2023 11:11 PM
Thumb Card Image
యాక్షన్ సీన్లకు డూప్ వద్దంటున్న ఎన్టీఆర్.!
13th Nov 2023 11:04 PM
Thumb Card Image
టాలీవుడ్ లో మరో విషాదం.! Actor Chandramohan Passed Away
13th Nov 2023 10:42 PM

Follow us on :