ఫైనల్ 2023 – వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టేన్ లకు ఆహ్వానం.!
క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ గురించి దేశం అంతటా చర్చ నడుస్తుంది. ఎప్పుడూ లేనంతగా ఈ వరల్డ్ కప్ ప్రత్యేకతను సంతరించుకుంది. అందరి ఆశ భారత్ గెలవాలనే. కాగా రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం బిసిసిఐ భారీ ఏర్పాట్లు చేస్తుంది. మ్యాచ్ చూసేందుకు ప్రపంచకప్ విన్నింగ్ కెప్టేన్లకు ఆహ్వానం పంపింది. వారికి స్పెషల్ బ్లేజర్ అందించనుంది. కాగా పాకిస్థాన్ మాజీ కెప్టేన్ ఇమ్రాన్ ఖాన్ జైలు లో ఉండటం వలన ఆయన తప్ప మిగతా కెప్టెన్లందరూ రానున్నారు. ప్రముఖ సింగర్లు - డాన్సర్ లతో స్పెషల్ ప్రోగ్రాం లు కూడా చేయించనుంది. సరికొత్త వినోద కార్యక్రమాలతో పాటు, ఆట పాట అన్నీ ఉండనున్నాయి.
ఇటు హైదరాబాద్ అంతటా కూడా వరల్డ్ కప్ ఫీవర్ భారీగా కనపడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మైదానాల్లో బిగ్ స్క్రిన్ లను ఏర్పాటు చేయనున్నారు అని టాక్. గతంలో కూడా క్రికెట్ ఈవెంట్లకు వచ్చిన భారీ స్పందన దృష్ట్యా ఈసారి మరెంత ఘనంగా ఏర్పాట్లు చేయనున్నారు. మైదానాల్లో సౌండ్ బాక్స్ లు, లైటింగ్ లతో సందడి సిటీ అంతా సందడి చేయనున్నారు క్రికెట్ అభిమానులు.
ఏది ఏమైనా ఈసారి వరల్డ్ కప్ మాత్రం క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.