సినిమా స్టయిల్ లో కేటీఆర్ రాజకీయ ప్రచారం.! KTR Political Promotion With Film Celebrities
సినిమా స్టయిల్ లో కేటీఆర్ రాజకీయ ప్రచారం.! KTR Political Promotion With Film Celebrities
తెలంగాణాలో రాజకీయ వేడి రాజుకున్న సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ రాజకీయం గతంలో చూసుకుంటే ఇక్కడ టిడిపి, టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు ప్రధాన పార్టీలు గా ఉండేవి. కానీ రాష్ట్ర విభజన తరువాత – తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో జరిగిన ఎన్నికలో కేవలం టిడిపి మరియు టీఆరెస్ పార్టీలు మాత్రమే బలంగా నిలబడి ఆనాడు ఎన్నికల బరిలో ఢీ కొన్నాయి. అప్పటి ఎన్నికల ఫలితాల్లో టీఆరెస్ పార్టీ గెలవడం కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం, ఆ తరువాత మెల్లిగా టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ మారి, సైకిల్ దిగి కార్ ఎక్కి గులాబీ కండువా కప్పుకోవడంతో టిడిపి పార్టీ వ్యాప్తి ఇక్కడ బాగా తగ్గిపోయింది.
కాగా ఆ తరువాత 2019 ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ కి పోటీగా బిజెపి పార్టీ రావాలి అనుకున్నప్పటికీ – ఆ రోజుకి ఉన్న కేసీఆర్ హవా గులాబీ దళాన్ని మరోసారి జైతయాత్ర మీద ఊరేగించింది.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. అసలు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ తెచ్చిన పేరు చెప్పుకొని లక్షల కోట్లు భుజించింది కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అనే నినాదంతో ఇక్కడ మళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకులకి ఊపిరినిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ అధిష్టానం కాస్త తెలంగాణ అణువణువు తెలిసిన, ప్రతిమనిషి ఎదలో మెరిసిన రేవంత్ రెడ్డి వంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రకటించడంతో ఈసారి రాజకీయ పరిస్థితులు యుద్దవాతావరణం లో గడవసాగాయి. చార్మినార్ ప్రాంతానికి మాత్రమే పార్టీ గా పరిమితమైన ఎమ్ ఐ ఎమ్ వంటి పార్టీ నేతలు ఈ వేడిలో ఆద్యం పోసేది అంతగా ఉండదు కాబట్టి కాంగ్రెస్ మరియు టీఆరెస్ పార్టీలే గట్టి పోటీ ఇవ్వనున్న ఈ తరుణంలో ఎన్నికల హడావుడి మొదలవ్వడం, పార్టీలు పార్టీ నాయకులు ప్రచారం స్టార్ట్ చేయడం అన్నీ చకచకా సాగిపోయాయి. ఇలాంటి అప్పుడే కేటీఆర్ చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినీ మీడియాలో సినిమా ప్రచారం అంటే సినిమా ఇండస్ట్రీ తో పాటు – ప్రజలలో బాగా తెలిసిన యాంకర్లతో, ఫేమస్ ఆర్టిస్ట్ లతో, సినిమా మార్కెట్ ని ప్రభావితం చేయగల వ్యక్తులతో ప్రచారం చేయించి తమ సినిమాను ప్రజలలో బాగా తెలిసేలా చేస్తుంటారు మేకర్స్. ఇప్పుడు కేటీఆర్ ప్లాన్ కూడా అదే. సినిమా స్టార్స్, యాంకర్స్, సెలబ్రిటీలు వంటి వారితో ఇంటర్వ్యూ లు ఇంటరాక్షన్ లు చేస్తూ తన రాజకీయ ప్రచారానికి సినిమా బాక్స్ ఆఫీస్ ని వినియోగిస్తున్నాడు. అలా అని ఇతర పార్టీ నేతలు కూడా డైరెక్ట్ గానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజాగా కేటీఆర్ గంగవ్వ తో ఒక ఇంటర్వ్యూ చేస్తూ తానే స్వయంగా మటన్ కూర వండాడు.. దీనికోసం గంగవ్వ అండ్ టీం కి టీఆరెస్ పార్టీ సుమారు 2 కోట్లు రూపాయిలు చెల్లించింది అని ఒక న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ కాగా ఇది వాస్తవం అంటూ కొందరు అవాస్తవం అంటూ మరికొందరు మీడియా ముఖంగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది. మరి సినిమా స్టైల్ లో చేస్తున్న కేటీఆర్ ప్రచారం ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టేనా అంటే ఎన్నికలు అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.